దక్షిణ లెబనాన్‌‌పై ఇజ్రాయెల్ దాడి 9 మంది మృతి 

దక్షిణ లెబనాన్‌‌పై ఇజ్రాయెల్ దాడి 9 మంది మృతి 

కఫర్ రుమ్మాన్: దక్షిణ లెబనాన్‌‌లోని ఓ గ్రామంపై ఇజ్రాయెల్ వైమానిక దళం సోమవారం జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండు నెలల కింద కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ - హిజ్బుల్లా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

కఫర్ రుమ్మాన్ గ్రామంలోని ఓ నివాస భవనంపై జరిగిన దాడిలో ఒక బాలుడు, ఇద్దరు మహిళలతో పాటు ఐదుగురు పురుషులతో సహా మొత్తం 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. కాఒరుపై జరిగిన దాడిలో లెబనాన్ ఇస్లామిక్ రిసాలా స్కౌట్ అసోసియేషన్‌‌కు చెందిన ఒక పారామెడిక్ మృతి చెందగా, మరో ఇద్దరు 
గాయపడ్డారు.